Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 12:48 pm Posted by : ramakrishna

దర్శకుడు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్, బతుకమ్మ :  సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పై రాష్ట్రీయ వానరసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఇటీవల వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని  సరూర్ నగర్ పోలీసులకు  రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేసింది.  రాజమౌళిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని  రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు పోలీసులను కోరింది.  హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పి వేల కోట్లు సంపాదిస్తున్న సినీ రంగ ప్రముఖులు, కార్యక్రమాలలో ఇలాంటి ప్రసంగాలు చేసి మతాల మధ్య విద్వేషం రగిలిస్తున్నారని వానర సేన ఆగ్రహం వ్యక్తం చేసింది.  రాజమౌళిపై కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని, లేదంటే వానర సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని వానర సేన రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు.


Police complaint against director SS Rajamouli