Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 9:23 am Posted by : ramakrishna

అర్ధరాత్రి సిటీ లో పోలీస్ కమిషనర్ హల్ చల్

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ కు పోలీస్ కోత్వాల్ గా ఇటీవల నియమితులై బాధ్యతలు స్వీకరించిన పోతరాజు సాయి చైతన్య నగరంలో హల్ చల్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రధానంగా సున్నిత ప్రాంతమైన అహ్మది బజార్( శంభుని గుడి), గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ ప్రాంతల లో రాత్రి పరిశీలించారు. రంజాన్ పండుగ సందర్భంగా షాపింగ్ రద్ధి, అర్ధరాత్రి వరకు కార్యకలపాలు, ఇటీవల పొరుగు రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో  పోలీస్  పికెటింగ్ లను పరిశీలించారు. రైల్వే స్టేషన్ ను తనిఖీ చేశారు..

అహ్మది మార్కెట్ లో పర్యటన…. వ్యాపారులతో ముచ్చట

ఇటివల అహ్మది బజార్ లో రోడ్డుపై తోపుడు బండ్ల ఏర్పాటును స్థానికంగా వ్యాపారులు ఒప్పుకోవడం లేదు. రంజాన్ పండుగ కోసం సామాగ్రిని కొనుగోలు చేసిన తోపుడు బళ్ల వ్యాపారుల తమకు అనుమతి ఇప్పించండని కోరుతున్నారు. వారం రోజులుగా ఈ వ్యవహారం నడుస్తోంది. రెండు రోజుల క్రితం అక్కడ వ్యాపారం చేయడానికి యత్నించగా ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో తోపుడు బల్లను తొలిగించి స్టేషన్ కు తరలించారు. ప్రతి ఏటా రంజాన్ మాసంలో అహ్మది బజార్ లో తోపుడు బండ్లు ఏర్పాటు చేస్తే రోజుకు రూ,1,000 వసూలు చేసేవారు. అక్కడ ఈ సారి డబ్బులు ఇవ్వకపోవడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అక్కడ పర్యటించారు. వ్యాపారులతో మాట మంతి కలిపారు. వ్యాపార  కార్యకలాపాల గురించి ఆరా తీశారు.

Police Commissioner's visit to the city at midnight