Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 5:59 pm Posted by : ramakrishna

ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును సందర్శించిన పోలీస్ కమిషనర్

మెండోరా, బతుకమ్మ : ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టుపై సందర్శకుల తాకిడి ఎక్కువ అవుతున్న సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ వివరాలు ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉన్నందున గోదావరి పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలన సూచించారు. ప్రాజెక్టు  దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని  సూచించారు. అత్యవసర సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని  లేదా డయల్ 100  లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు.  ప్రాజెక్టుపై పర్యటకుల సందడి ఎక్కువ అవుతున్న సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట ఆర్మూర్ ఏసిపి వై.వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, మెండోరా ఎస్సై జె.సుహాసిని తదితరులు ఉన్నారు.

Police Commissioner visits SRSP project