Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2025, 5:39 pm Posted by : ramakrishna

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న పోలీస్ కమిషనర్

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ హెడ్ క్వాటర్స్ లో శనివారం నిర్వహించిన దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. దుర్గా పరమేశ్వరి మాత మందిరం వద్ద ఏర్పాట్లలో భాగంగా లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ సందర్భంగా  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావు , నిజామాబాద్ ఏసీపి రాజా వెంకట్ రెడ్డి , సీటీసీ ఏ సి పి రాజశేఖర్,  స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ (అడ్మిన్) తిరుపతి  (వెల్ఫేర్) సతీష్ (హోమ్ గార్డ్) వినోద్ (ట్రాఫిక్ ) పోలీస్ హెడ్ క్వార్టర్ సిబ్బంది, పోలీస్ కార్యాలయ సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది,  స్పెషల్ పార్టీ సిబ్బంది , హోమ్ గార్డ్స్ విభాగము,  రేంజ్ కార్యాలయం సిబ్బంది , స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Police Commissioner participates in Devi Navratri celebrations