బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది తమ విధుల పట్ల నీకచ్చిగా ఉండాలని అన్నారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్న లేదా ఎలాంటి సమాచారం తెలిసిన తమపై స్థాయి అధికారులకు హుటాహుటిన తెలియజేయాలని తెలిపారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలవకుండా ట్రాఫిక్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. బందోబస్తు లో అన్ని రకాల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ సంబంధిత పోలీసు అధికారులకు మరియు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించగలరని అన్నారు. అనంతరం సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గల దుర్గామాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎసిపి శ్రీనివాస్ , బోధన్ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ తదితరులు ఉన్నారు.
