Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 2:15 pm Posted by : ramakrishna

ఒలంపిక్ రన్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

 

నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ:

రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఒలంపిక్ రన్ ను జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవ రెడ్డి, బోబ్బిలి నర్సయ్య అధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్.ఆర్ చౌరస్తా నుండి నుంచి పాత కలెక్టరేట్ వరకు జరిగిన ఓలంపిక్ రన్ ను  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్యఅతిథిగా జెండాను ఊపి  ప్రారంభించారు.  ఈసందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ఒలంపిక్ ప్రపంచ దేశాలన్నీ ఈ క్రీడల్లో పాల్గొంటారని ప్రతి క్రీడాకారుని కల ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనడం ఆశయమని అన్నారు. ఒలంపిక్ డే సందర్భంగా జిల్లా ఒలంపిక్ సంఘం నిర్వహించిన ఒలంపిక్ రన్ క్రీడాకారులు విద్యార్థులు పాల్గొనడం హర్షణీయమని అన్నారు. చదువుతోపాటు అందరి విద్యార్థులకు క్రీడలు చాలా అవసరమని ప్రతి విద్యార్థి ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని అందులో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా జాతీయ జెండాను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించాలని ఆకాంక్షించారు. ఈ ఈ సందర్భంగా ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది విధులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మెన్ కేశ వేణు, జిల్లా ఒలింపిక్ సంఘం సభ్యులు నిజామాబాద్ నగర ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Police Commissioner launches Olympic Run