ఇంటర్ సెప్టర్ వాహనాన్ని ప్రారంభించిన పోలీస్ కమీషనర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్ సెప్టర్ వాహనాన్ని సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ఈ వాహనం ధర్నాలు, ఆందోళనల సమయంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు, నేరాల నియంత్రణకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏ.ఆర్) రామచంద్రరావు, నిజామాబాదు ఏసీపీ ప్రకాష్, రిజర్వ్ ఇన్స్ పెక్టర్ (ఎం.టి.ఓ) శేఖర్ బాబు, (అడ్మిన్) ధరణి కుమార్, (వెల్ఫేర్) సతీష్ తదితరులు పాల్గొన్నారు.