సిరికొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్

సిరికొండ, బతుకమ్మ:  నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సిరికొండ పోలీస్ స్టేషన్ ను సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్  పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు సూచించారు.  ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు...