నవీపేట్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నవీపేట్ పోలీస్ స్టేషన్ ను సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ ను మొత్తం కలియతిరిగి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం కృషి చేయాలి అని అన్నారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత ను వాణిజ్య సాముదయాలు, గ్రామాలలోని ప్రధానమైన చౌరస్తా లలో, ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజల కు అవగాహన కల్పించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. రౌడీ షీటర్ లను ప్రతీ రోజు వారి దిన చర్యను గ్రహించి వారు మళ్ళీ ఎలాంటి నేరాలు చేయకుండా తగు చర్యతీసుకోవాలని , వారి ఆగడలను పూర్తి గా అనగద్రోకాలని తెలిపారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు , దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు. సిబ్బoది సాధక బాధలు ప్రతీ ఒక్కరిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా నార్త్ రూరల్ సీ.ఐ బి.శ్రీనివాస్, నవీపేట్ ఎస్ఎచ్ఓ కే.వినయ్ లు పాల్గొన్నారు.
