మోపాల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

మోపాల్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం మోపాల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్  పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.  ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్...