Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 8:24 pm Posted by : ramakrishna

మోపాల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

మోపాల్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం మోపాల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్  పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.  ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు

Police Commissioner inspects Mopal Police Station

జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు , దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.  ఈ సందర్బంగ నిజామాబాదు సౌత్ రూరల్ సీఐ . సతీష్ కుమార్, మొగ్పాల్  ఎస్ఐ యాదగిరి,  పోలీస్ స్టేషన్ సిబ్బంది  పాల్గొన్నారు.

Police Commissioner inspects Mopal Police Station