కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల బ్యారక్ లను తనిఖీ చేసి, వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ విభాగంలో నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు ఇచ్చారు. స్టేషన్ పరిధిలోని రికార్డ్ లను పరిశీలిస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి...