జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

   జక్రాన్ పల్లి, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహణకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని, పాత నేరస్తుల గుర్తించి బైండోవర్ చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బుధవారం సిపి సాయి చైతన్య జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, బ్యారక్ , అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పై తనిఖీలు చేసి ప్రతీ కేసుకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి, దర్యాప్తు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు...