జక్రాన్ పల్లి, బతుకమ్మ :
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహణకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని, పాత నేరస్తుల గుర్తించి బైండోవర్ చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బుధవారం సిపి సాయి చైతన్య జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, బ్యారక్ , అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పై తనిఖీలు చేసి ప్రతీ కేసుకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి, దర్యాప్తు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతి ధరఖాస్తును ఆన్లైన్ లో నమోదు చేసి ఫిర్యాదు దారునికి ఒక కాపీ ఇచ్చి సంతకం తీసుకోవాలి, అలాగే రిజిస్టర్లో కూడా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్టు సూచించారు. సైబర్ క్రైమ్ అవగాహన పాఠశాలలు , కళాశాలల్లో సోషల్ మీడియా ద్వారా అవగాహన నిర్వహించాలని కోరారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు తీర్చే విధంగా పనిచేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సమన్వయం బలపరచుకోవాలని తెలిపారు. రోడ్ ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని, యువతలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ పై అవగాహన కార్యక్రమలు నిర్వహించాలని అన్నారు. సిబ్బంది ఎప్పుడు హెడ్ క్వార్టర్స్ యందు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని, ప్రతీ 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలి, ద్విచక్రవాహనం నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా జక్రాన్ పల్లి ఎస్.ఐ జి. మహేష్ సిబ్బంది ఉన్నారు.
