బోధన్ , బతుకమ్మ :
తొలి సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య మంగళవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. అదే సమయంలో సాలూరులోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని కూడా సీపీ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధానాలు, సిబ్బంది నియామకం పై సంబంధిత అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సామాగ్రి భద్రపరిచే విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలని సీపీ స్పష్టం చేశారు. పోలింగ్ ఉదయం, మద్యహ్నం, సాయంత్రం కౌంటింగ్ గురువారం జరుగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీతో పాటు బోధన్ ఎసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు తదితరులు పాల్గోన్నారు.
