బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మంగళవారం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముందుగా గౌరవ వందనం స్వీకరించిన అనంతరం యూనిఫాం టర్న్ అవుట్, కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. అనంతరం ఏసీపీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి, వివిధ రకాల ఫైళ్లను తనిఖీ చేసి పోలీస్ విభాగం పనితీరును సమీక్షించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై నాణ్యమైన దర్యాప్తు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియాలో అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశించారు. గ్రామస్థాయిలో...