అద్విక ఫ్యామిలీని అభినందించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పుట్టినరోజు సందర్భంగా హెల్మెట్లను పంపిణీ చేసిన అద్విక ఫ్యామిలీని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. ఈనెల 2న గూపాన్ పల్లి గ్రామంలో అద్విక పుట్టినరోజు సందర్భంగా 60 హెల్మెట్లను గ్రామ ప్రజలకు ఆద్విక కుటుంబ సభ్యులు సామాజిక సేవలో భాగంగా పంపిణీ చేశారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన అద్విక, వారి కుటుంబ సభ్యులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిచి వారు చేపట్టిన మంచి కార్యక్రమాన్ని అభినందించి శాలువతో సన్మానించారు....