బతుకమ్మ, భిక్కనూరు: ఇటీవల ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అగ్ని ప్రమాదానికి గురై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ట్రావెల్స్ బస్సుల భద్రత అనుమతులపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రైవేట్ బస్సులపై భిక్కనూరు పోలీసులు బుధవారం టోల్ ప్లాజా సమీపంలో తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఫిట్ నెస్ ,బీమా, పర్మిట్ పత్రాలు లేకుండా నడుపుతున్న ట్రావెల్ బస్సులపై చర్యలు తీసుకుంటామని భిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు హెచ్చరించారు.