. . . ముందస్ధుగా నాయకులు కార్యకర్తల అరెస్ట్
నిజామాబాద్, బతుకమ్మ:
తెలంగాణ రాష్ట్ర సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత గురువారం చేపట్టిన భూ పోరాటానికి పోలీసులు చెక్ పెట్టారు. ఉప్పల్ భగాయత్ లో ఉద్యమకారుల ఆధ్వర్యంలో చేపట్టిన భూ పోరాట ధర్నా వెల్లకుండా టిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పోలీసులు తెలంగాణ రాష్ట్ర సేన నాయకులను, కార్యకర్తలను తెల్లవారుజామునుంచే అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ నేత కవిత చేపట్టిన భూ పోరాటానికి ప్రజల నుంచి వస్తున్న మద్దతును తట్టుకోలేక ప్రభుత్వం, పోలీస్ శాఖ ద్వారా నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారని టీఆర్ఎస్ నాయకులు కరిపే రాజు అన్నారు. పోలీసులు అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలు బేషరతుగా విడుదల చేయాలని కోరారు.