సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు
కామారెడ్డి, బతుకమ్మ : సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురిలో ఒకరు మైనర్ కాగా మరొకరు ఆర్మీలో ఉద్యోగం వదిలి ముఠాలో పని చేస్తున్నాడు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. గత నెల 25న కామారెడ్డిలో ఓ వ్యక్తి తనను కొందరు వ్యక్తులు ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కామారెడ్డి సబ్...