న్యాయవాదిపై పోలిస్ ల దౌర్జన్యం  కోర్టు ఎదుట బార్ అసోసియేషన్  అందోళన 

పోలీసుల దౌర్జన్యానికి వృతిరేకంగా న్యాయవాదులు విధుల బహిష్కరణ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాది గా ప్రాక్టీస్ చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ కలీమ్ పై పోలీసుల భౌతిక దాడి అత్యoత హేయమైన చర్యగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆక్షేపించింది.గురువారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్ లో నిర్వహించిన బార్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, వి.భాస్కర్, పరుచూరి శ్రీధర్ ,మద్దెపల్లి శంకర్ లు మాట్లాడుతూ చట్టప్రకారం విధులు నిర్వహించాల్సిన...