- తన సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతును ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ
నిర్మల్, బతుకమ్మ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చాడు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎమ్మార్వో ఆఫీసు నుండి ఏఎస్ఐ ఈడ్చుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.