Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2024, 3:46 pm Posted by : ramakrishna

పోలీసులు టీచర్లయ్యారు..

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు సిబ్బంది టీచర్ ఉద్యోగాలు సాధించారు. డి. మహేశ్(స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్), కె నాగేంద్రబాబు, ఎం.లిఖిత, కె నాగరాజు, డి సంధ్య, ఎం.వినోద్ కుమార్(ఎస్జీటీ) సాధించగా, కె నవీన్, పి. హరీశ్ పీఈటీలుగా ఎంపికయ్యారు. టీచర్ ఉద్యోగాలు సాధించిన సిబ్బంది సీపీ కల్మేశ్వర్ ను మంగళవారం  మర్యాదపూర్వకంగా కలువగా, సీపీ వారిని అభినందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు విభాగంలో 24 గంటలపాటు పని చేస్తూనే టీచర్ ఉద్యోగానికి సన్నద్ధమై ఎంపికకావడం అభినందనీయమని అన్నారు. విద్యాశాఖలో సైతం మంచి పేరు తెచ్చుకోవాలని, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు డీసీపీలు (అడ్మిన్) కోటేశ్వర రావు, (లా అండ్ ఆర్డర్) బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.