Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2025, 3:56 pm Posted by : ramakrishna

పోలీస్ కళాబృందం వినూత్న ప్రచార పద్ధతులు

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జిల్లా ప్రజలను నిజామాబాద్ పోలీస్ కళాబృందం, మాదకద్రవ్యాల వైపు యువత మొగ్గుచూపకుండా చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తం, మహిళల రక్షణకోసం కొత్త చట్టాలపై అవగాహణ, మార్చ్ నుండి సెప్టెంబర్ వరకు 117 అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడించారు.  పోలీస్ సిబ్బంది ఒక కళాబృందముగా ఏర్పడి ప్రతీ పల్లెలో తీవ్రతరమైన సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, మహిళల రక్షణ, ముఢనమ్మకాల పై  అవగాహన  కల్పిస్తూ, ప్రజలను కొంత మంది స్వార్ధ పరులు వారి యొక్క బలహీనతను సొమ్ము చేసు కుంటునారన్న సమాచారం మేరకు ప్రజల మనస్సులో ఇంకా పటిష్టoగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ కళాబృందం వినూత్న ప్రచార పద్ధతులను చేపట్టిందన్నారు. నిజామాబాద్ పోలీస్ వ్యవస్థ ఒక పేరు” పోలీను కళా బృందం ” ఇందులో భాగంగా ప్రజల జీవితాలలో వెలుగు నింపుటకు స్వచ్చంద కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ పోలీస్ కళాబృందం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సమాజంలో తప్పులు,నేరాలు జరుగకుండా ముందస్తుగా ప్రజలలో పాటలు మరియు నాటకాల రూపంలో చైతన్యం కలిగించడం అన్నారు. ఈ కళాబృందానికి అన్ని గ్రామాలలో ప్రదర్శన సమయంలో మంచి స్పందన వస్తుందని, ప్రజల లో చైతన్యం తీసుకొని రావడం మాత్రమే మా ప్రధాన కర్తవ్యం అని ప్రధానంగా సామాజిక అంశాలు, చట్టాలు, హక్కులపై చాలా మందికి అవగాహాన కల్పించడం జరిగిందని వెల్లడించారు. ఈ కళా బృందానికి ఇంచార్జీగా రిజర్వు ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీనివాస్, ఎ.ఆర్.ఎస్.శ్రీ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శేఖర్, విక్రమ్, మహిళా హోమ్ గార్డు సీత, అవుట్ సోర్స్ బాల రాజ్ తదితరులు పాల్గొన్నారు.