దారి దోపిడీకి పాల్పడిన బిహారీ హమాలీలను అరెస్టు చేసిన పోలీసులు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  ఈ నెల 19 న అర్ధరాత్రి కొత్త పేట్ గ్రామ శివారులో దారిదోపిడీకి పాల్పడిన ముగ్గురు బిహర్ హమాలీలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ తెలిపారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  సిఐ మాట్లాడుతు... ఎడపల్లి మండలం కుర్నపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్ గితేష్ నిజామాబాద్ లో తన పని ముగించుకుని బుదవారం రాత్రి బైక్ పై ఇంటికి వెళుతుండగా కొత్త పేట్ గ్రామం వద్ద ముగ్గురు వ్యక్తులు దాడిచేసి దోచుకున్నారు....