నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ నెల 19 న అర్ధరాత్రి కొత్త పేట్ గ్రామ శివారులో దారిదోపిడీకి పాల్పడిన ముగ్గురు బిహర్ హమాలీలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ తెలిపారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ మాట్లాడుతు… ఎడపల్లి మండలం కుర్నపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్ గితేష్ నిజామాబాద్ లో తన పని ముగించుకుని బుదవారం రాత్రి బైక్ పై ఇంటికి వెళుతుండగా కొత్త పేట్ గ్రామం వద్ద ముగ్గురు వ్యక్తులు దాడిచేసి దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కొత్తపేట్ శివారులోని శ్రీ గంగా రైస్ మిల్ యజమాని గోపాల్ వద్ధ హమాలీలుగా పని చేసే కుంధన్, విజయ్, సుంధర్ లను అదుపులోకి తీసుకుని విచారించడంతో వారే దారిదోపిడికి పాల్పడినట్లు ఒప్పుకున్నారన్నారు. 24 గంటల్లోను ముగ్గురు బిహర్ కు చెందిన హమాలీలను అరెస్టు చేసి వారిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు చేధనలో ఎస్ఐ అరిప్, సిబ్బందిని సిఐ అభినంధించారు.