Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2025, 6:22 pm Posted by : ramakrishna

కత్తితోె సంచరిస్తున్న యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు

 చేసేది గంజాయి దందా… అడ్డొస్తే కత్తితో చంపుతా అని బెదిరించడం నైజం

 . . . పోలీస్ సిబ్బందిపై దాడికి యత్నం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలో గంజాయి విక్రయాలు చేస్తు, రౌడీ గ్యాంగ్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ, అడ్డు వచ్చిన వారిని కత్తితో సంచరిస్తు చంపుతానని బెదిరిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎసిపి కార్యాలయంలో సిసిఎస్ ఎసిపి నాగేంద్ర చారి తో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ….  బుధవారం నగరంలో ఫ్రూట్ మార్కెట్ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని స్థానిక ఒకటో టౌన్ పోలీసులకు సమాచారం అందింది. వారు సిసిఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో నగరంలోని అసద్ బాబా నగర్ కు చెందిన  షేక్ ఇర్ఫాన్ అనే యువకుడిని పట్టుకున్నారు. అతని వద్ద గంజాయితో పాటు కత్తిని స్వాధినం చేసుకున్నారు.  ఎవరైనా తన పనికి అడ్డు వస్తే కత్తితో బెదిరించడంతో ఇర్ఫాన్ కు అలవాటు అని తెలిపారు. ఈ నెల 7న రాత్రి సవేరా హోటల్ వద్ద బర్సాత్ అమీర్ అనే రౌడీ షీటర్ తో కలిసి ఇర్ఫాన్, కాలు దాదా, జసీన్, ముదస్సిర్, షెహబాజ్, జునైద్, సర్పరాజ్, లాలా, యాసీన్, సల్మాన్, పర్హాన్, డానిష్ లతో కలిసి ఆటోలో వెళ్తున్న వ్యక్తికి కత్తులు చూపించి, పంచ్ లతో కొట్టి అతని వద్ద రూ.400 లాక్కున్నారు. పోన్ లాక్కునేందుకు యత్నించగా అతను ఎదురు తిరగడంతో అతనిపై దాడి చేసి గాయపరిచి పరారీ అయ్యారు. అదే రోజు సాయంత్రం 7.30 ప్రాంతంలో అసద్ బాబా నగర్ వద్ధ ఆర్పార్ ఆటో నగర్ వైపు బైక్ వెళుతుండగా స్థానిక పోలీసులు అతన్ని ఆపేందుకు యత్నించారు. కత్తితో వారిపై దాడి చేసి పారిపోయిన ఇర్ఫాన్ ను పట్టుకోవడంలో స్థానిక పోలీసులతో పాటు నిజామాబాద్ టాస్క్ పోర్స్ ఎసిపి నాగేంద్ర చారి, వారి సిబ్బంది  సహకరించడం పట్ల సిపి సాయి చైతన్య అభినందించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో సిసిఎస్ ఎసిపి నాగేంధ్ర చారీ, ఓకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తదితరులు పాల్గోన్నారు.