Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 5:23 pm Posted by : ramakrishna

దేశానికి రక్షక కవచం పోలీస్

  • శాంతి భద్రతలను ఉల్లంఘిస్తే సహించేది లేదు
  • ఎస్ఐ సందీప్

 

ఇందల్వాయి,బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసుల సంస్మన్న దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. విది నిర్వహణలో అసువులు బాసిన అమరులకు ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. జిల్లా లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోస్ ఐ.జీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి,కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి,పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు.విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ,అమరులైన పోలీసులను స్మరించుకోవడం,వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు.పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా  ఐ.జీ,కలెక్టర్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.అమరవీరుల ఫోటోలకు పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు.రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.విది నిర్వహణ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టీ ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు.ఈ నేపథ్యంలోనే ఇటీవలే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అసాంఘిక శక్తుల చేతిలో ప్రమోద్ కుమార్ అనే పోలీసు వీర మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు.అమరుల త్యాగాలను వృధా కానివ్వమని,వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు.శాంతి భద్రతలు సజావుగా ఉన్నప్పుడే సమాజం,దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్ధవంతంగా అందాలంటే శాంతిభద్రతలు నెలకొని ఉన్నప్పుడే సాధ్యపడుతుందని అన్నారు. ఈ దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల సేవలు, వారి త్యాగాలు అనన్య సామాన్యమైనవని కొనియాడారు.కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ఎలాంటి విపత్తు సంభవించినా,ముందుగా స్పందించేది పోలీసులేనని గుర్తు చేశారు.