Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2025, 7:13 pm Posted by : ramakrishna

పేకాట రాయుళ్ల అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఆరో టౌన్ పరిధిలో పేకాట ఆడుతున్న 10మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కె.వెంకట్ రావ్ తెలిపారు. నగరంలోని శాస్త్రి నగర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు తన  సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో 10మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.76వేల నగదు, రెండు మోటార్ బైక్ లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.