Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2025, 9:19 pm Posted by : ramakrishna

పేకాట రాయుళ్ల అరెస్ట్

నిజామాబాద్ క్రైం,బతుకమ్మ : నగరంలోని మూడో టౌన్ పరిధిలో పేకాట ఆడుతున్న 10మందిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ హరి బాబు తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం.. మూడో టౌన్ పరిధిలోని గౌతం నగర్ కాలనీలో ని మసీదు పక్కన పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 10మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 8సెల్ ఫోన్లు, రూ.5660నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.