Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 8:49 pm Posted by : ramakrishna

పేకాట రాయుళ్ల అరెస్ట్

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట రాయుళ్లను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి  నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.4,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.