ముబారక్ నగర్ లో ముసురుకున్న విష జ్వరాలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు పత్తాలేని వైద్యాధికారులు బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ కుటుంబంలో చూసిన విష జ్వరాలతో ప్రజలు శతమతమవుతున్నారు. దీంతో బాధితుల సంఖ్య రోజుకు ఎక్కువవుతుంది. వీటిని అదుపు చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు పదివేల జనాభా కలిగిన ఆ డివిజన్లో ఇప్పటివరకు ప్రభుత్వాలు కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించకపోవడం విశేషం. గత ప్రభుత్వం బస్తీ దవఖాన లాంటి ఆస్పత్రులు వివిధ...