పచ్చబొట్టు కవితా సంకలనం ఆవిష్కరణ
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రానికి చెందిన కవులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, ఘనపురం దేవేందర్, జి నరసింహస్వామి, తిరుమల శ్రీనివాస్ ఆర్య, నరాల సుధాకర్ కలిసి రచించిన ‘పచ్చబొట్టు’ కవితా సంకలనాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెలంగాణ రచయితల సంఘం పదేండ్ల సాహిత్య సభలో కవితా సంకలనాన్ని ఆవిష్కరించి సిధారెడ్డి నిజామాబాద్ జిల్లాలో బలమైన సాహిత్య వాతావరణం ఉందని అభినందించారు. నిజామాబాద్ కవులు రూపొందించిన...