కాళోజీ సాహితీ పురస్కారానికి కవయిత్రి నెల్లుట్ల రమాదేవి ఎంపిక
హైదరాబాద్,బతుకమ్మ : ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా జరిగే కార్యక్రమంలో ఆమెకు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేయనుంది.