కవి, రచయిత డాక్టర్ అందెశ్రీ సంస్మరణ సభ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కవి, రచయిత డాక్టర్ అందెశ్రీ సంస్మరణ సభ మంగళవారం సంస్కార భారతి ఆద్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కార భారతి ప్రతినిధులు, ఇందూరు కవులు,రచయితలు అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ తన రచనల ద్వారా ఊపిరి పోశారని వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్కార భారతి ప్రతినిధులు గంట్యాల ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కవులు వీపి చందన్ రావ్, గణపతి అశోక్ శర్మ, కంకణాల...