కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల్ , బతుకమ్మ : ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టిపెట్టాలని, కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని ఎమ్మెల్సీ కవిత ఆదివారం దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని, రూ.1000 కోట్లతో కొండగట్టు అభివృద్ధికి కేసీఆర్ ప్రణాళిక వేశారని గుర్తు చేశారు. అదే ప్రణాళికతో లేదంటే మరింత మెరుగైన ప్రణాళికతో కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టును...