Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2025, 8:08 pm Posted by : ramakrishna

కొండగ‌ట్టు ఆంజ‌నేయ స్వామిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

జగిత్యాల్ , బతుకమ్మ : ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చే క్షేత్రంపై రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌భుత్వం దృష్టిపెట్టాలని, కొండ‌గట్టు ఆల‌య అభివృద్ధిని ఆప‌వ‌ద్ద‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని ఎమ్మెల్సీ కవిత ఆదివారం దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Poem by MLC Kalvakuntla who visited Anjaneya Swamy in Kondagatu

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ హ‌యాంలో మొద‌లుపెట్టిన అభివృద్ధి ప‌నుల‌ను కొన‌సాగించాలని, రూ.1000 కోట్ల‌తో కొండ‌గ‌ట్టు అభివృద్ధికి కేసీఆర్ ప్ర‌ణాళిక వేశారని గుర్తు చేశారు. అదే ప్ర‌ణాళిక‌తో లేదంటే మ‌రింత మెరుగైన ప్ర‌ణాళిక‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొండ‌గ‌ట్టును అభివృద్ధి చేయాలని, కొండ‌గ‌ట్టు రోడ్డు అభివృద్ధి చేయాల‌ని

Poem by MLC Kalvakuntla who visited Anjaneya Swamy in Kondagatu

స్థానికులు కోరుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌రమన్నారు. రూ 25 కోట్లు ఖ‌ర్చు చేసి కొండపై నీటి స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించామన్నారు. దేవుడి భూముల‌ను కాపాడ‌డానికి, ఎస్సారెస్పీ నీటితో కొండ‌పై రెండు ట్యాంకుల్లో నింప‌డానికి క‌నెక్ష‌న్ ఇప్పించామ‌ని గుర్తు చేశారు.

Poem by MLC Kalvakuntla who visited Anjaneya Swamy in Kondagatu