Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 4:42 pm Posted by : ramakrishna

వర్ని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన పోచారం

 

. . .  వైద్య సేవలపై ఆరా

 

. . . మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచనః

 

బాన్సువాడ, బతుకమ్మ :  

 

వర్ని మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా కలిసి వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న చికిత్సపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం డీసీహెచ్‌ఓ శ్రీనివాస్ ప్రసాద్‌తో మాట్లాడి ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వివరాలు, అవసరమైన సిబ్బంది నియామకం, వైద్య పరికరాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలని తెలిపారు.

Pocharam visited the government hospital in Varni