Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2024, 12:48 pm Posted by : ramakrishna

. . .వ్యవసాయ సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

రైతుగా అనుభవంతో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా

. . . పోచారం శ్రీనివాస్ రెడ్డి

 బతుకమ్మ, హైద్రాబాద్:

నేను రైతుగా ,  రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పని చేసిన అనుభవంను పరిగణలోకి తీసుకోని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ప్రభుత్వ వ్యవసాయ సలహదారుగా నియమించారు. రైతుగా అనుభవంతో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర  ప్రభుత్వ వ్యవసాయ సలహదారుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పధవి భాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయంలో  పోచారం శ్రీనివాస్ రెడ్డి  వ్యవసాయ సలహదారుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన చాంబర్లో వేద పండితులు మంత్రోచ్ఛరణ చేసి ఆశీర్వాదం అందజేశారు. ఈ సంధర్బంగా పోచారం మాట్లడుతు… వ్యవసాయ శాఖలో మంత్రి వర్గంతో సమన్వయం చేసుకుని రైతులకు మెలు చేసే కార్యక్రమంలో బాగస్వాములు అవుతామన్నారు. ప్రభుత్వ ఆర్టిక పరిస్థితి భాగలేకున్నా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీ మేరకు ఇప్పటికే రుణమాఫి చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులను విడుధల చేస్తుందన్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖల మద్య సమన్వయంతో రైతులకు కావాల్సిన కార్యక్రమాలను చెపడుతామని అన్నారు.బోదన్ శాసన సభ్యులు, మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేంధర్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ లు పోచారం కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన సతీమణి పుష్పను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో పరిశ్రమ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.ప్రభుత్వ వ్యవసాయ సలదారులుగా పదవి బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గం నాయకులు  సన్మాన కార్యక్రమం చేపట్టి శుభాకాంక్షలు తెలిపారు

 

Pocharam Srinivas Reddy who took charge as agricultural advisor