నిజాంసాగర్ వరద గేట్లను ఎత్తిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ, నిజాంసాగర్ : భారీ వర్షాలతో మంజీరా నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో వరద గేట్లను ఎత్తి నీటిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర ఆగ్రస్ చైర్మన్ కాసుల బాలరాజు లు దిగువకు విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు,ప్రజాప్రతినిధులు, నాయకులతో తో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ కు పూజలు చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్న,దిగువన విడుదల అవుతున్న వరద నీటి వివరాలను పోచారం కి వివరించారు....