Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2024, 7:17 pm Posted by : ramakrishna

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు గా పోచారం శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచమ్మ శ్రీనివాస్ రెడ్డి వేల 23లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏడవసారి బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటివరకు బీఆర్ఎస్ లో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ మంత్రిగా, రాష్ట్ర శాసనసభ పతిగా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్లో చేరితే సముచిత స్థానం ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సలహాదారుగా నియమించినట్లు తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తన సొంత గ్రామమైన పోచారం గ్రామంలో సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, తెలుగుదేశం పార్టీలో చేరి డిసిసిబి చైర్మన్ గా పనిచేశారు. బాన్స్ వాడ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగాను పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ రాజకీయ వేత్తలలో ఒకరైన పోచారం శ్రీనివాస్ రెడ్డి తనకు తానుగా రైతు గా అందరికీ సుపరిచితులు. కెసిఆర్ హయాంలో పోచన్న శ్రీనివాస్ రెడ్డిని లక్ష్మీపుత్రులుగా అభివర్ణించేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అందులో వ్యవసాయ విభాగానికి ప్రత్యేకంగా నియమించడం విశేషం. క్యాబినెట్ హోదాతో సమానంగా రెండు సంవత్సరాలు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. నిజాంబాద్ ఉమ్మడి జిల్లాలో పోచారం తోపాటు షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పనిచేస్తున్నారు.