జనవరి 1 నుండి పోచారం ప్రాజెక్టు నీటి విడుదల
బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : రబీ పంటల సాగు కోసం జనవరి ఒకటో తేదీ నుండి పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు ఎల్లారెడ్డి నీటిపారుదల శాఖ డిఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పోచారం ప్రాజెక్టు నీటి విడుదలపై ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలోని నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాల రైతులతో తైబందీ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రబీలో ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ఏ జోన్ కు సాగునీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,820 టీఎంసీలకు గాను...