బాన్సువాడలో గాంధీ విగ్రహానికి నివాళ్ళర్పించిన పోచారం
బాన్సువాడ, బతుకమ్మ : మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్‌లో మహాత్మ గాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, సహనం అనే విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మ గాంధీ మహనీయుడని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ చూపిన అహింసా మార్గం, ప్రజలను ఏకం చేసిన నాయకత్వం దేశ చరిత్రలో...