వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న పోచారం

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పద్మశాలి సంఘం గణేష్ మండలి, స్వర్ణకార గణేష్ మండలి వారి  గణేష్ నిమజ్జన శోభాయాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ శోభాయాత్రలో భక్తులతో కలసి కోలాటంలో పాల్గొన్నారు. ఈ గణేష్ శోభాయాత్రలో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. [video width="848" height="478" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/09/WhatsApp-Video-2025-09-06-at-5.39.50-PM.mp4"][/video]