Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 6:30 pm Posted by : ramakrishna

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పోచారం భేటీ

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని జల సౌధలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోరా, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన పోచారం శనివారం జలసౌధలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి తో  సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోరా, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల గురించి చర్చించారు. వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్ కు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు.

Pocharam meets with Minister Uttam Kumar Reddy