చిన్నసైజు చేపపిల్లల సరఫరాపై పోచారం ఆగ్రహం
. వాపస్ పంపించాలని ఆదేశం . పెద్ద సైజు పిల్లలను మాత్రమే చెరువులో వదిలిన ప్రభుత్వ సలహాదారు బతుకమ్మ , బాన్సువాడ : వందశాతం సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లల సైజు చిన్నగా ఉండడంపై రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ పట్టణంలోని కల్కీ చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన పోచారం చేప పిల్లల సైజు చిన్నగా ఉండడంతో మత్స్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు....