Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2024, 3:09 pm Posted by : ramakrishna

చిన్నసైజు చేపపిల్లల సరఫరాపై పోచారం ఆగ్రహం


Pocharam is angry about the supply of small-sized fish

. వాపస్ పంపించాలని ఆదేశం

. పెద్ద సైజు పిల్లలను మాత్రమే చెరువులో వదిలిన ప్రభుత్వ సలహాదారు

బతుకమ్మ  , బాన్సువాడ : వందశాతం సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లల సైజు చిన్నగా ఉండడంపై రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ పట్టణంలోని కల్కీ చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన పోచారం చేప పిల్లల సైజు చిన్నగా ఉండడంతో మత్స్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నసైజు పిల్లలను వాపస్ పంపించాలని ఆదేశించారు. పెద్ద సైజు పిల్లలను మాత్రమే చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైజు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి చేప పిల్లలను కొనుగోలు చేస్తోందని, ఇటువంటి చేప పిల్లలను సరఫరా చేస్తే అవి పెరగడవని అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తాను మత్స్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించామని, గొప్ప ఆలోచన తో చేసిన పథకం ఇదని, దీనికి పూర్తిగా కర్త, కర్మ, క్రియా తానేనని అన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, అంజిరెడ్డి, ఎజాజ్‌, నార్ల సురేశ్, నార్ల రవీందర్‌, జిల్లా మత్స్య శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.