నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన పోచారం
నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు సోమవారం పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పోచారం, ఘనపూర్ ల నుండి భారీగా వరద నీరు రావడంతో నిజాంసాగర్ నుండి గేట్లు ఎత్తి నీరు మంజీరా నదిలోకి వదలడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టును, గేట్లను, కాలువలను స్థానిక, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు...