Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 7:02 am Posted by : ramakrishna

పోచారం డ్యాం సేఫ్

 

. . . గోడకు ముందు ఉన్న మట్టి మాత్రమే కోతకు గురైంది

. . .  ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో

నాగిరెడ్డి పేట్, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లాలో పోచారం డ్యాం సురక్షితమని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రాజేక్టుకు బుధవారం వరకు లక్షన్నర క్యూసెక్కుల వరద వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా లక్షకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడం ప్రాజెక్టు పైనుంచి( సర్ ప్లస్) లో నీటి ఔట్ ఫ్లో కొనసాగడంతో ప్రాజేక్టుకు ప్రమాదం అని అందరూ భయపడ్డారు. ప్రాజెక్టుకు బుంగ పడిందని ఎక్షణమైన ప్రమాధం సంభవమని పుకార్లు షికార్లు చేశాయి. కేవలం గోడకు ముందు ఉన్న మట్టి మాత్రమే కోతకు గురైంది. పోచారం డ్యామ్ పూర్తిగా సురక్షితం గా ఉన్నది.

Pocharam Dam safe

ప్రాజెక్టు ఎలాంటి నష్టం వాటిల్ల లేదు కేవలం బ్రిడ్జి వద్ద రోడ్డు ఇరువైపులా కోతకు గురైందని అధికారులు తెలిపారు. వరద శాంతించడం ప్రాజెక్టులోకి 47,467 క్యూసెక్కులు వస్తుండంటో అంతె మొత్తంలో వరద పొంగిపొరలి దిగువకు వెలుతుంది. ప్రాజెక్టుకు అపథ అని అధికారులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అధికారుల ప్రకటనతో  ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.