Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 9:49 pm Posted by : ramakrishna

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న పోచారం దంపతులు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు కార్యక్రమంలో దేవనాధ రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి – పుష్ప దంపతులు పాల్గొన్నారు. పోచారంతో కలిసి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నారు.

 

Pocharam couple participating in Lord Venkateswara Swamy Brahmotsavam

 

దేవనాధ రామానుజ జీయర్ స్వామి వారిచే భక్తులకు తీర్థ గోష్ఠి, నారాయణ ఇష్టి, ధ్వజకుంభారాధన బలిహారణం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేశారు. అనంతరం అంగరంగ వైభవంగా మాడవీధుల్లో ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం చంద్ర ప్రభ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

 

Pocharam couple participating in Lord Venkateswara Swamy Brahmotsavam